NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దుస్తులను పంపిణీ చేసిన కమతం మహేశ్వర్ రెడ్డి

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేసి తమ మానవతా దృక్పతాన్ని చాటుకున్నారు కమతం మహేశ్వర్ రెడ్డి..కర్నూలు పట్టణం 42వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు వినాయకుని నిమజ్జనం సందర్భంగా ఉప్పలదడియ కమతం మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42 వ వార్డు ఇన్చార్జి ఎన్ తిమ్మారెడ్డి మరియు వార్డ్ శానిటేషన్ సూపర్వైజర్ యు శ్రీనివాసులు పారిశుద్య కార్మికులకు దుస్తులను అందజేశారు.తెల్లవారుజాము నుండి డ్రైనేజీ కాలువలు మరియు వార్డులో ఉన్న కాలనీలను శుభ్రం చేస్తూ వారు ఎనలేని కృషి చేస్తున్నందువల్లే కాలనీలు శుభ్రంగా ఉంటున్నాయని కార్మికుల కృషి వల్లే కాలనీలు శుభ్రంగా ఉంటున్నాయని వారిని అభినందించారు. దుస్తులు అందజేసినందుకు గాను కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ నగర్ వినాయక యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *