ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా సీఎం రిలీఫ్ ఫండ్ – ఎమ్మెల్యే బోడే ప్రసాద్
1 min read
44 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు.. మరో 5 మందికి LOCలు…సుమారు రూ.27 లక్షల ఆర్థిక సాయం
పెనమలూరు , న్యూస్ నేడు: నియోజకవర్గానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులు,మరో 5 మందికి LOCలు కలిపి సుమారు రూ.27 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ అందజేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోంది,వైద్య ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా సాయం అందేలా కృషి చేస్తున్నాం అని తెలిపార2014–19 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.20 కోట్ల మేర CMRF సాయం అందించామని కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలోనే సుమారు రూ.25 కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు.అనారోగ్యం,అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయం అందిస్తూ ముందుంటానని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హామీ ఇచ్చారు.ప్రజారోగ్యం – సంక్షేమం – పేదల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందుకున్న లబ్ధిదారులు తమ కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి సాయం త్వరగా మంజూరు అయ్యేలా కృషి చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షులు అనుమేలు ప్రభాకర్ రావు రాష్ట్ర గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ దుర్గగుడి పాలకమండ సభ్యులు వెలగపూడి శంకర్ బాబు బిజెపి నాయకులు ఏకుల విజయేంద్ర ఏఎంసీ చైర్మన్ అన్నే ధన రామ కోటేశ్వరరావు.కొండా ప్రవీణ్ కుమార్ మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనంద ప్రసాద్ మార్పుడి కోటేశ్వరరావు బొగ్గవరపు శ్రీనివాసరావు అంగిరేకుల మురళి యార్లగడ్డ సుచిత్ర కూటమి నాయకులు, కార్యకర్తలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



