లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ పర్వతనేని సుభాష్ బాబు జన్మదినోత్సవం
1 min read
ఎస్సి,బిసి హాస్టల్స్ 200మంది విద్యార్థులకు పరీక్ష అట్టలు జామెంట్రీ బాక్సులు పంపిణీ
జిల్లా 316G గవర్నర్ లయన్ డా:దశక సుబ్బారావు, లయన్.డా:సరస్వతి ఆధ్వర్యంలో కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ పర్వతనేని సుభాష్ బాబు జన్మదినోత్సవంపురస్కరించుకొని లయన్స్ జిల్లా 316G గవర్నర్ లయన్ డా:దశక సుబ్బారావు, లయన్.డా:సరస్వతి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు లయన్స్ జిల్లా ఆఫీసు నందు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లయన్స్ పూర్వపు ఎన్.వి.వి.ఎస్. గవర్నర్లు పాపారావు నాయుడు, కాకరాల వేణుబాబు,కేవీ కిషోర్ కుమార్, వి.మురళీమోహనరావు,డాక్టర్ పి.విజయభాస్కర రెడ్డి,జిల్లా ఉప గవర్నర్లు ఆర్.వి. సూర్యనారాయణరాజు,వి.సత్య స్వరూప్,తదితరులు శుభాకాంక్షలు అందజేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభలో లయన్స్ జిల్లా నాయకులు లేళ్ల వెంకటేశ్వరరావు,కే.బి.రావు, డి.హేమ సుందర్,కుర్మా శ్రీనివాస్, పుట్టా విజయశ్రీ,వి. రత్నకుమార్,సిహెచ్ అవినాష్ రాజ్,పి.సుబ్రహ్మణ్య,దేవరకొండ వెంకటేశ్వర్లు తదితరులు సుభాష్ బాబును ఘనంగా సత్కరించారు.లయన్ సుభాష్ బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో లయనిజం సేవలు నిత్యం సామాన్య,మధ్యతరగతి, నిరుపేదలకు,అందేలా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జన్మదినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఎస్సి మరియు బిసి హాస్టల్స్ నందు విద్య అభ్యసిస్తున్న సుమారు 200 మంది విద్యార్థులకు పరీక్ష అట్టలు జామెంట్రీ బాక్సులు నోట్ పుస్తకాలు వృత్తి శిక్షణ విద్యార్థులకు నోటు పుస్తకాలు వారికి అవసరమైన మెటీరియల్ పంపిణీ చేశారు.



