రాష్ట్ర ఇంజనీరింగ్ చీప్ తో కలసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, హంద్రీ నీవా కాలవ పరిశీలన
1 min read
అభివృద్ధి పనులు చెరువులకు నీటి విడు దల పైన క్షేత్రస్థాయి లో పరిశీలన
ఎమ్మెల్యే షాజహాన్ బాషా
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ఎలినీనో ప్రభావంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యం లో హంద్రీనీవా కాలువ ద్వారా చెరువు లకు నీటి తరలింపుకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం తో మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ భాష ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మిట్ట ప్రాంతంలో ప్రవహి స్తున్న కాలవ ద్వారా తగ్గు ప్రాంతంలోని చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బుధ వారం ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ చీప్ ప్రభాకర్ నీటితర లింపు కార్యక్రమాన్ని పరిశీలించడానికి మదనపల్లె కు రావడంతో ఎమ్మెల్యే షాజహాన్ భాష అధికారి తో కలసి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, అమ్మ చెరువు, కోళ్లబైలు సమీపంలోని కాలువ సొరంగ మార్గాన్ని పరిశీ లించడం జరిగింది. పది రోజులు పైగా ప్రవహించే హంద్రీ నీవా జలాలను వీలైనంత ఎక్కువ గా వాడుకొని చెరువులు నింపే కార్యక్రమం చేపట్టేందుకు ప్రణాళిక లను రూపొందించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ చీఫ్ ప్రభాకర్ ఎమ్మెల్యే షాజహాన్ భాషలు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆదేశాలతో కృష్ణా జలాలను హంద్రీ నీవా కాలవ ద్వారా కుప్పం వరకు తరలించే కార్య క్రమం కొనసాగు తొంద న్నారు. వర్ష బావ పరిస్థితుల దృశ్యా మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని వీలైనన్ని చెరువులను నీటితో నింపడానికి చర్యలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు నాయుడు, రమేష్ రెడ్డి, రెడ్డి రాయల్, చెల్లా, మోహన్ రెడ్డి, యర్రబల్లి వెంకట రమణారెడ్డి, కేవీ నాగరాజు, మోడెం సిద్ధప్ప, కమలా మరి కృష్ణ, బాలా మణి శేఖర్, నవీన్ చౌదరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



