NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పుస్తకాల పఠనంతో విజ్ఞాన వికాసం

1 min read

గ్రంధాలయాలకు పూర్వవైభం తీసుకురావడమే లక్ష్యం

ఏపీ పబ్లిక్ లైబ్రరీస్ సంచాలకులు ఎ.కృష్ణమోహన్

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : పుస్తకాల పఠనంతో సంపూర్ణ విజ్ఞాన వికాసంలభిస్తుందని ఏపీ పబ్లిక్ లైబ్రరీస్ సంచాలకులు ఎ.కృష్ణమోహన్ పేర్కొన్నారు.బుధవారం అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా మదనపల్లె లో ప్రధాన శాఖ గ్రంధాలయాన్ని ఆయన సందర్శించారు. స్థానిక శాఖ గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంత కుమారి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ గ్రంధాలయ  నిర్వహణ తీరు  బాగుందని, రాష్ట్ర ప్రభుత్వం నూత నంగా అమలులోకి తీసుకొచ్చిన లైబ్రరీ యాప్ వినియోగిస్తు న్నారని,మరింత మందిని యాప్ వినియోగించేలా చూడాలని కోరుతూ గ్రంథాలయ అధికారిణి పని తీరును  కొని యాడారు. గ్రంధాలయ వ్యవస్థ కు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపు తోందన్నారు.గ్రంథాలయాల ఆవశ్యక తను నిరుద్యోగులు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం సిబ్బంది కొరత, జాబ్ క్యాలెండర్ విడుదలైన నేపథ్యంలో గ్రంధాలయంలోని పుస్తక విభాగం పని వేళలను ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు మార్చే ప్రతి పాదనలు పంపితే ఆమోదిస్తామన్నారు. గ్రంథాలయం లో అన్నిరకాల పుస్తకాలు అందు బాటులో ఉన్నాయని, పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ నిరుద్యోగులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను  సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శర్మ, గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంత కుమారి, రెడ్డెప్ప, భాస్కర్ రెడ్డి జయమ్మ లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *