శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి పేరిట ఎండోమెంట్ ప్రైజ్
1 min read
పాలకొల్లు , న్యూస్ నేడు: స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం నేతృత్వంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తమ జీతాలనుండి డెబ్భై ఐదు వేల రూపాయల విరాళాన్ని అందించగా ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.కళాశాల వ్యవస్థాపకులు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి పేరిట ఈ శాశ్వత ప్రతిభా బహుమతిని ఏర్పాటు కొరకు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఇచ్చిన ఈ నిధిపై వచ్చే వడ్డీతో రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రతి ఏటా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ మెరిట్ బహుమతిని అందజేయనున్నట్లు ప్రిన్సిపాల్ తెలియజేసారు.విద్యార్థుల భవిష్యత్తును కాంక్షిస్తూ, వారిలో మరింత పోటీతత్వాన్ని పెంపొందించేందుకు తమ వంతు బాధ్యతగా ఈ విరాళాన్ని అందించిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందిని ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల సిబ్బంది చూపిన ఈ ఉదారత, సేవా భావం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ, ఐక్యూ ఏసి కోఆర్డినేటర్ డా బూసి వెంకటస్వామి,అకడమిక్ కోఆర్డినేటర్ సుమలత, జువాలజీ శాఖాధిపతి డా యం రామకృష్ణ,ఆంగ్ల శాఖాధిపతి కె శామ్యూల్, అర్ధశాస్త్ర శాఖాధిపతి డా శ్రీరామ్ వి నరేంద్ర, గణిత విభాగాధిపతి యం శేఖర్ అధ్యాపకులు జి షమీం,రగుతు షణ్ముఖరావు,పి సునీల్ కుమార్,పి శ్రీనివాస్,డా వి డి వి విజయలక్ష్మి,సి హెచ్ రవికుమార్,జి డి శ్రీనివాసరావు,కె పార్థసారథి,వి శిరీష,ఏ వంశీ సుబ్బరాయన్,కె స్వర్ణలత, బి ఆశాజ్యోతి,డి మన్మధరావు,వి వి రమేష్, డి హెప్సిబా రాణి,యస్ శ్రీదేవి, సి హెచ్ చిన్ని, జి వేణు మాధురి, యం దివ్య, కె రోహిత్ కుమార్, ఎం శిరీష,పి దుర్గారావు, ఐ భాగ్యలక్ష్మి,యం డి శిరీష,సూపరింటెండెంట్ బి.కనక లక్ష్మి, కె రమణ మూర్తి,ఏ శాంతకుమారి, కె శ్రీలక్ష్మి, కె సీతయ్య, యం ఇందిర,జె నరసింహారావు, కె మిస్సమ్మ, పి యన్ వి సుబ్బారావు, వి రామకృష్ణ, కె వెంకటేశ్వరావు, ఆర్ తేజస్వి,తదితరులు పాల్గొన్నారు.


