అంగన్వాడీ సేవలు వినియోగించుకోవాలి:ఎమ్మెల్యే
1 min read
అంగన్వాడీ కార్యకర్తలకు ఘనంగా సన్మానం..
నందికొట్కూరు న్యూస్ నేడు: అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో 3 వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం “అంగన్వాడీ ఉత్సవం-సేవా సంకల్ప్ అభియాన్” కార్యక్రమం అంగన్వాడి సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మరియు సిడిపిఓ మంగవల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు గర్భవతులకు బాలింతలు మంచి ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పోషకాహారం ఇస్తుందని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మహిళలకు సూచించారు.సిడిపిఓ మాట్లాడుతూ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తే విద్య ఆరోగ్యపరంగా వారు బాగుంటారని అన్నారు. తర్వాత మంచిగా సేవలు అందించిన అంగన్వాడీ కార్యకర్తలు సరస్వతి, పార్వతి,మహేశ్వరి లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,అబ్జర్వర్ వెంకటశివుడు,పలుచాని మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


