NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ గ్రంథాలయం యాప్‌పై సమీక్ష సమావేశం

1 min read

పాఠకులకు  గ్రంథా లయం యాప్ ను చేరువ చేయాలి

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : మదనపల్లె ప్రధమ శ్రేణి   గ్రంథాలయం లో శనివారం ఏపీ గ్రంథాలయం యాప్ పనితీరుపై సమీక్ష సమావేశం  జరిగింది.ఈ సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువా రెడ్డి, కార్యదర్శి శర్మ ల ఆధ్వర్యంలో చిత్తూరు  పరిధిలో ఉన్న గ్రంథాలయ అధికారుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ రెడ్డి వారి గురవారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  నాయ కత్వంలో  విద్యా శాఖ మంత్రి  నారా లోకేష్ సారధ్యంలో గ్రంథాలయాల ను అభివృద్ధి చేయా లనే లక్ష్యంతో  జిల్లాలోని వివిధ శాఖా గ్రంథాలయా ల్లో ఏపీ గ్రంథా లయం యాప్ తీసుకు రావడం జరిగింది. యాప్ ను గ్రంథాలయ అధికారులందరూ వినియోగించుకోవాలని చైర్మన్ కోరారు. యాప్‌ను ప్రతి గ్రంథాలయంలో సమర్థవంతంగా వినియోగిస్తూ, పాఠకులకు డిజిటల్ గ్రంథాల య సేవలను మరింత అందు బాటులోకి తీసుకు రావాలని  సూచించారు. యాప్ లో జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయాల్లో పుస్తకాలను అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. గ్రంధాలయానికి వచ్చే పాఠకులకు యాప్ లో లాగిన్ అయ్యే విధంగా చైతన్య పరచాలని కోరారు.   అంతకు ముందు గ్రంథా లయంలో చైర్మన్ హాజరు రిజిస్టర్ పత్రికల రిజిస్టర్ బుక్స్ ను పరి శీలించారు. స్థానిక మదనపల్లె గ్రంథాలయ పరిధి లో 19 వేలు పుస్త కాలకు పైగా ఉన్నాయిని వాటి వినియోగించుకోవాలని కోరారు. అనంతరం చైర్మన్ డాక్టర్ రెడ్డి వారి గురవారెడ్డి కి పుష్పగుచ్చం అందజేసి  శాలువా తో సత్కరించారు.ఈ  కార్యక్రమంలో  స్థానిక గ్రంథాలయ అధికారి వసంత కుమారి, మదనపల్లె పరిధిలో గ్రంథా లయ అధికారులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *