NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూరు ప్రజలు తెలివైన వారు

1 min read

ముచ్చుమర్రి’లో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ శబరి..

నందికొట్కూరు న్యూస్ నేడు: గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగనీరు అందించడమే ముఖ్య ఉద్దేశమని నంద్యాల ఎంపీ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.నంద్యాల జిల్లా పగి డ్యాల మండల పరిధిలోని పాత ముచ్చుమర్రి గ్రామంలో బస్టాండ్ సెంటర్లో ఐదు లక్షల ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎంపీ శబరి మాట్లాడుతూ నందికొట్కూరు ప్రజలు తెలివైన వారని ఎంపీ నిధులతో గ్రామాల్లో దళిత,బడుగు బలహీన వర్గాల కాలనీల్లో మినరల్ వాటర్ ఫ్లాంట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. మినరల్ వాటర్ ఫ్లాంట్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి నాగేశ్వరరావు, డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,కాటం వెంకటరామిరెడ్డి,చిన్న సుంకన్న,కట్టుబడి శ్రీనివాసులు మరియు కాంట్రాక్టర్ జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *