NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్రి టెక్ ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి పిఎల్ వరలక్ష్మి మేడం  సబ్సిడీ ద్వారా ఇచ్చే శనగ విత్తనాలు ప్రాసెసింగ్ చేస్తున్నటువంటి  శివ సాయి మరియు మహంకాళేశ్వర అగ్రి టెక్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా తనిఖీ చేయడమే ఉంది. శనగ విత్తనాలు ప్రభుత్వము నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ప్రాసింగ్ ప్లాంట్ యజమానులకు తెలియజేయడమైనది. కర్నూలు జిల్లాకు 33,200 క్వింటాళ్లు గాను ఇప్పటివరకు 6951 క్వింటాళ్లు రైతు సేవ కేంద్రాలకు సరఫరా చేయడం జరిగింది. అంతేకాకుండా వాల్యు చైన్ క్లస్టర్ లో భాగంగా విశిష్ట వేరుశనగ విత్తనాన్ని నిలువ ఉంచిన ఎన్​ఎస్​సి ద్వారా సప్లై చేయబోతున్న వేరుశనగ విత్తనాలను శివ సాయి కోల్డ్ స్టోరేజ్ నన్నూరు నందు తనిఖీ చేయడమైనది అంతేకాకుండా రబ్బానీ ఓల్డ్ స్టోరేజ్ నందుగల వేరుశనగ విత్తనాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఎన్​ఎస్​సి  వారికి  నాణ్యమైన వేరుశనగ విత్తనాలను సరఫరా చేయాలని తెలియజేయడమైనది. సాంకేతిక వ్యవసాయ అధికారులు రాఘవేంద్ర మరియు అనిల్ కుమార్ మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు కర్నూలు ఎం దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రాసెసింగ్ ప్లాంట్లకి ఇన్చార్జి లాగా నియమించిన అధికారులు కూడా పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *