సులువాయిలో కొళాయి పైపు లీకేజీకి తక్షణ పరిష్కారం
1 min read
పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు స్పందనతో పునరుద్ధరించిన తాగునీటి సరఫరా
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం సులువాయి గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి కొళాయి పైపులో ఏర్పడిన లీకేజీకి పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయించారు. పైపు లీకేజీ కారణంగా కాలనీలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో విషయం తెలుసుకున్న ఆయన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు.కొత్త పైపులను సమకూర్చి లీకేజీ ఉన్న పాత పైపులను తొలగించి, వాటి స్థానంలో కొత్త పైపులను ఏర్పాటు చేయించారు. అనంతరం మరమ్మతు పనులను పూర్తి చేసి తాగునీటి సరఫరాను యథావిధిగా పునరుద్ధరించారు.ప్రజల సమస్యలను గుర్తించిన వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించడంతో గ్రామ ప్రజలు పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులును అభినందించారు. ఇదే విధంగా గ్రామంలోని మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, వాటర్‌మ్యాన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



