NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“వైద్య విద్యను ఒత్తిడితో కాకుండా ఇష్టంతో, ఒక సవాలుగా స్వీకరించి ముందుకు సాగండి”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఏడిఎంఇ, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.కె.చిట్టి నరసమ్మ… ప్రపంచ మానసక ఆరోగ్యదిన వారోత్సవాల సందర్భంగా సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీలో అనస్థీషియా విభాగం ఆధ్వర్యం లో  నిర్వహించిన మోర్టాలిటీ సమావేశం లో పీజీ వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణపై అవగాహన కలిగించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ వైద్య విద్య అనేది సవాళ్లతో కూడుకున్నదని, అయితే దానిని ఒత్తిడిగా కాకుండా ఇష్టంతో, ఒక సవాలుగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు. ప్రతి విద్యార్థి తనకు కష్టంగా అనిపించే సబ్జెక్టులను ప్రత్యేకంగా గుర్తించి, వాటిపై ఆసక్తిని పెంచుకుని చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. వైద్య విద్యార్థులు అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలని సూచించారు.ప్రస్తుతం అనేక మందిలో విటమిన్-డి, విటమిన్-బి12 లోపాలు కనిపిస్తున్నాయని, ఇవి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అవసరమైనప్పుడు వైద్యుల సలహాతో సంబంధిత విటమిన్ స్థాయిలను పరీక్షించుకోవడంతో పాటు, సమతుల్య ఆహారం తీసుకోవాలని, అవసరమైతే వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకోవాలని తెలిపారు.వైద్య విద్యార్థులు తమ చదువుతో పాటు తగిన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం, సానుకూల ఆలోచనా విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ సుధీర్, ప్రొఫెసర్లు డా.విశాల,  డా.రామ్ శివ నాయక్ , తదితర వైద్యులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *