NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమ అరెస్టులను ఖండించండి….

1 min read

సర్ ప్రక్రియ రద్దు చేసేంతవరకు పోరాటాలు జరుపుతాం

సిపిఐ,సిపిఐ(ఎం) సిపిఐ(ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సిపిఐ,సిపిఐ(ఎం),సిపిఐ(ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ,కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో అరెస్టులను ఖండించాలని,కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలని,సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ బిజెపి అధికారాన్ని సుస్థిరం చేసేందుకు పనిచేస్తుందని ఆరోపించారు. జ్ఞానేష్ కుమార్ తనతో పాటు ఉన్న ఇతర కమిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా బిజెపి కోసం పని చేశాడని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 18 కోట్ల ఓట్లను కుట్రపూరితంగా తొలగించారని దీనిని వ్యతిరేకిస్తూ దేశంలోని వామపక్ష పార్టీలు ప్రజాస్వామిక వాదులు చేస్తున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అణచివేయడానికి అనేక కుట్రలు పన్నుతుందని విమర్శించారు. ఇందులో భాగంగా ముందస్తుగా అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా అక్రమ అరెస్టులను ఖండిస్తూ జరుగుతున్న ఆందోళనలకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.ఎన్.వి.డి.ప్రసాద్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియను రద్దుచేసి సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని ఆందోళనలు చేస్తున్న వారిపై అక్రమ పోలీస్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్యయుత పద్ధతుల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం అణిచివేత ధోరణితో పోలీసుల ద్వారా నిర్భందకాండను ప్రయోగిస్తుందని విమర్శించారు. తొలగించిన ఓట్లను తిరిగి నమోదు చేసేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరావు, ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కురేళ్ళ వరప్రసాద్, ఏరియా నాయకులు ఉప్పులూరి లక్ష్మి,భవాని,ఎం.ఏ.హకిమ్, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ డాంగే, తమ్మిశెట్టి రమణయ్య, సిపిఎం నగర కార్యదర్శి పంపన రవి కుమార్, వై.యస్.కనకారావు,కడలి రామాంజనేయులు, జై.గోపి,కే శ్రీనివాస్, గనిగంటి కోటేశ్వరరావు మొహిద్దిన్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బద్ధ వెంకట్రావు,సోమయ్య, లోట్ల సత్యనారాయణ,ఎం.నాగరాజు, నాగేశ్వరరావు, ఎర్ర శ్రీనివాసరావు, విజయలక్ష్మి, ఏం అప్పారావు, దానవర ప్రసాద్ ఎస్ రామ్మోహన్, మాణికల నాగరాజు , నాగేశ్వరరావు నాహ్రు బాబు,s, రామోహన్, దుళ్ల వీరినాయుడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ బాబు ప్రసాద్,ఎస్ వి సుబ్బారావు.ఎస్ కే నజీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *