ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ లో అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రుమటాలజిస్ట్ డా. సృజన పాల్గొని ఆర్థరైటిస్ సమస్యలు, వాటి లక్షణాలు, చికిత్సా విధానాలపై అవగాహన కల్పించారు. ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కీళ్ల నొప్పులు, వాపు, కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం, వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి సకాలంలో వైద్య సలహా తీసుకునేలా ప్రోత్సహించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, ఆర్థరైటిస్ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందడం ముఖ్యమని తెలిపారు. కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం నిద్రలేచినప్పుడు కీళ్లు బిగుసుకుపోవడం, నడవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రోగి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స విధానం మారుతుందని, వైద్యుల సూచనలను పాటించాలని వివరించారు.కార్యక్రమంలో భాగంగా రోగులు వైద్యులను నేరుగా కలిసి ఆర్థరైటిస్‌కు సంబంధించిన తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం డా. గణేష్ కుమార్ రెడ్డి, డా. మంజునాథ్‌లతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అవగాహనతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగింది.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. “ఆరోగ్య సమస్యలపై సరైన అవగాహన కలిగి ఉండటం, అవసరమైన సమయంలో వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందాలి. రోగులు తమ సందేహాలను నేరుగా వైద్యులను అడిగి తెలుసుకునేలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ నిరంతరం కృషి చేస్తుంది” అని తెలిపారు.


