సి.హెచ్.ఎస్.డి.సెయింట్ థెరిసాలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
1 min read
ఉత్సాహంగా పాల్గొన్న థెరిసియన్లు
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలి
కళాశాల ప్రిన్సిపల్ డా:సిస్టర్ సునీల్ రాణి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక సి.హెచ్.ఎస్.డి. సెయింట్ థెరిసా స్వయంప్రతిపత్తి మహిళా కళాశాలలో ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గురువారం ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. కళాశాల సాస కో-ఆర్డినేటర్ ఆర్.చిట్టెమ్మ మరియు శపూజిత మిస్. శ్యామల సాస వాలంటీర్ల ఆధ్వర్యంలో పలు పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా:సిస్టర్ సునీల్ రాణి వైస్ ప్రిన్సిపల్ డా:సిస్టర్ సుశీల ఆధ్వర్యంలో మరియు IQAC కొ-ఆర్డినేటర్ సిఎ జ్యోతిర్మయి వివిధశాఖా విభాగ అధిపతులు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థినులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం “పచ్చదనం-పరిశుభ్రత” అనే అంశాలపై కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ ఎమ్ సుశీల అవగాహన కల్పించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యతను వివరించారు.పర్యావరణ సంరక్షణకు ప్రతీకగా డా. సిస్టర్ ఎమ్ సుశీల కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థినులను ప్రోత్సహించారు. చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.


