NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“బ్రెస్ట్ క్యాన్సర్ వైద్యవిజ్ఞాన సదస్సు పోస్టర్ విడుదల”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన లో భాగంగా ఈనెల 27వ తేదీన కర్నూల్ మెడికల్ కాలేజీ  జనరల్ సర్జరీ విభాగం మరియు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సీఎంఈ నిర్వహిస్తున్నట్లు, దీనికి ఐఎంఏ ఉమెన్స్ వింగ్ సహకారం అందిస్తున్నట్లు కర్నూల్ మెడికల్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్, జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ హరి చరణ్ తెలిపారు. గురువారం ఈ కార్యక్రమం సంబంధించిన పోస్టర్ ను ప్రిన్సిపల్ ఛాంబర్ యందు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళలకు బెస్ట్ క్యాన్సర్ పై అవగాహన అవసరమని వైద్యులు అధిక సంఖ్యలో ఈసీఎంఈ లో పాల్గొనాలని ఆయన  కోరారు. సీఎంఈలో పాల్గొన్న వారికి  క్రెడిట్ అవర్స్ ఆడ్ అవుతాయని అదే విధంగా  వారికి  సోనో మామోగ్రామ్  ఉచితంగా చేస్తామని, 26న వైద్య విద్యార్థులకు ఈ అంశం పై వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ప్రభుత్వాసుపత్రిలో ఓపీ నెంబర్ 14 లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కలిగిస్తున్నట్లు సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ మాధవ్ శ్యామల తెలిపారు.  ఈ  కార్యక్రమంలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సి ఎస్ కే ప్రకాష్, డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మి, సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి శ్యామల, ఐఎంఏ ఉమెన్ స్వింగ్ సెక్రటరీ డాక్టర్ విష్ణు ప్రియ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *