ఎన్నికలలో సిపిఐ,సిపిఎం పార్టీలు తొమ్మిది డివిజన్లో పోటీ చేయాలని నిర్ణయం
1 min read
సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో సిపిఐ సిపిఎం నాయకుల సంయుక్త సమావేశం
సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అక్టోబర్ 15 ఈనెల 28న జరుగునున్న ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలలో సిపిఐ, సిపిఎం పార్టీలు తొమ్మిది డివిజన్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. గురువారం సాయంత్రం సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో సిపిఐ సిపిఎం నాయకుల సంయుక్త సమావేశం సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగింది. సిపిఐ 4,11,21,22,29,60 డివిజన్లో పోటీ చేయాలని, సిపిఎం 27,33 కానీ 34, 56 డివిజన్లో పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకొని కార్పొరేషన్ ఎన్నికలలో వామపక్ష పార్టీల బలాన్ని పెంచుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు, సిపిఐ మరియు సిపిఎం నాయకులు బండి వెంకటేశ్వరరావు, డి ఎన్ వి డి ప్రసాద్, ఉప్పులూరి హేమ శంకర్, రెడ్డి శ్రీనివాస్ డాంగే, పంపన రవికుమార్, కూరేళ్ల వరప్రసాద్ పాల్గొన్నారు.


