NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుంద జెడ్పీహెచ్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తనిఖీ

1 min read

వద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంఈఓ-2 పి. కబీర్ సాబ్

విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలి

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంఈఓ-2 పి. కబీర్ సాబ్ పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన, పోషక విలువలు కలిగిన భోజనం అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెరగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. భోజనం తయారీ సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, భోజన నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి మధ్యాహ్న భోజన పథకం ఎంతో కీలకమని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, విద్యార్థులకు మెరుగైన భోజన సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *