NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒక్కసారి అవకాశం ఇవ్వండి…వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా

1 min read

రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఇడగొట్టి మల్లీశ్వరి

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె పట్టణం రెండవ వార్డు లో కూటమి మద్దతుతో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు వార్డు ప్రజల అవకాశం ఇచ్చి గెలిపిస్తే  వార్డును ఆదర్శవంతంగా అభివృద్ధి చేసి చూపిస్తామని కౌన్సిలర్ అభ్యర్థి మల్లీశ్వరి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ డాన్స్ రెడ్డెన్నలు స్పష్టం చేశారు. శనివారం రెండవ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగించారు. నేరుగా ప్రజలను కలుసు కొని కరపత్రాలను పంచి పెడుతూ వార్డుకు సుపరిచి తుడుగా స్థానిక సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన తమకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపిస్తే వార్డు ప్రజలకు జవాబుదారీగా ఉంటు, సంక్షేమ పథకాలు అర్హులు అందించడమే కాకుండా సమస్యల ను పరిష్కరిస్తూ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్ భాష సహాయ సహకారా లతో మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి శ్రీరామ్ చిన్నబాబు ద్వారా వార్డుకు అత్యధిక నిధులు తీసుకువచ్చి మౌలిక సదు పాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పారు. పేద మధ్య తరగతి కుటుంబాలు నివాసం ఉండే వార్డు లో పారి శుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లకు ప్రాధాన్యత ఉండేలా కృషి చేస్తామని చెప్పారు. కావున కౌన్సిలర్ అభ్యర్థిగా ఇడగొట్టి మల్లీశ్వరి కి, చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించా లని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యర్రబల్లి వెంకట రమణారెడ్డి, స్థానిక కూటం పార్టీల నాయకులు వార్డు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *