ఘనంగా గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు
1 min read
ఆది ఆంధ్ర నగరపాలక పాఠశాల విద్యార్థి,విద్యార్థులకు భోజనం ప్లేట్లు,నోట్ బుక్స్ పంపిణీ
అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న గాడ్ ఫాదర్స్ ,కి దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు
అధ్యక్ష ,కార్యదర్శులు సొంగ మధుసూదనరావు,యర్రా జయదాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ద్వితీయ వార్షికోత్సవం స్థానిక వంగాయ గూడెం సొసైటీ సెంటర్ లో అధ్యక్ష , కార్యదర్శులు సొంగ మధుసూదన్ రావు (మధు) యర్రా జయదాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గడచిన రెండు సంవత్సరాలలో జిల్లాలో మరియు స్థానికంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూన్నరు. వార్షికోత్సవం సందర్భంగా స్థానిక ఆదిఆంధ్ర నగరపాలక పాఠశాల లో విద్యను అభ్యసిస్తున్న సుమారు 25 మంది విద్యార్థిని,విద్యార్థులకు భోజన ప్లేట్లు, గ్లాసులు, నోట్ బుక్స్,పలకలు, బలపాలు అందజేసి తృతీయ వార్షికోత్సవ కేకును కట్ చేసి అందించారు. దానిలో భాగంగా నగరానికి చెందిన 12 ఏళ్ల బాలుడికి సొసైటీ అధ్యక్ష , కార్యదర్శులు సొంగ మధు,యర్రా జయదాస్ కొంత నగదును అందజేశారు. ఏలూరు నగరానికి చెందిన బాలుడుకి గుండెకు సంబంధించిన వ్యాధితో తీవ్ర ఇబ్బందులకు గురైయ్యాడు. గత కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్నాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి ప్రయాణమవుతున్నట్లు సోసైటీ దృష్టికి వచ్చింది. దానిలో భాగంగా కొంత నగదు సహాయాన్ని అందజేస్తున్నట్లు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో బాలుడికి ఎడమ వైపు ఉండవలసిన గుండె కుడి వైపు న ఉండటంతో రక్త ప్రసరణ సంబంధించిన ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వ సహాయంతో ఒక ఆపరేషన్ చేయించుకోగా, వేరొక సర్జరీ కోసం దాతలను సహాయం కోరడంతో మా (గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ )ద్వారా ఆ బాలుడికి పెద్ద మొత్తాన్ని అందించి సహకరించామన్నారు.ఆర్థికంగా వెనకబడి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న మహిళలకు చీరలను పంపిణీ చేసినట్లు అధ్యక్ష , కార్యదర్శులు తెలియజేశారు. మా సొసైటీ కి విద్య,వైద్యం భోజనం ఇలా అన్ని విదాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న గాడ్ ఫాదర్స్ కి,దాతలకు శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు అధ్యక్ష , కార్యదర్శులు తెలియజేశారు.



