NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఏర్పాట్లపై ఆకస్మికంగా తనిఖీ

1 min read

చేపల తూము పోలింగ్ కేంద్రం, సీఆర్ రెడ్డి కాలేజ్ స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలన

ఏలూరు రేంజ్ ఐజి జి వి జి అశోక్ కుమార్,

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణను అత్యంత పకడ్బందీగా, పారదర్శక వాతావరణంలో పూర్తి చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తు ఏర్పాట్ల లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజి జి వి జి అశోక్ కుమార్ ఐపీఎస్ వారు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారు ఈరోజు 25.10. 2026 ఏలూరు లోని పలు ఎన్నికల కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఏలూరు చేపల తూము సెంటర్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రాన్ని, అలాగే ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్  కేంద్రాన్ని ఎస్పీ స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన ఎస్పీ  ఎన్నికల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు,సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు.చేపల తూము సెంటర్‌ లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, సరైన రాకపోకల దారులు మరియు క్యూలైన్ల ఏర్పాటుపై అధికారులకు తగిన ఆదేశాలు జేశారు.సి.ఆర్.రెడ్డి కాలేజీ లోని స్ట్రాంగ్ రూమ్‌ లను సందర్శించి,ఓట్ల భద్రతకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేయాల్సిన త్రివిద భద్రతా వలయం  సీసీటీవీ నిఘా మరియు 24 గంటల ప్రత్యేక పోలీసు పహారాపై స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు.స్ట్రాంగ్ రూమ్‌ లు మరియు పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనధికార వ్యక్తులు లేదా వాహనాలు ప్రవేశించకుండా కఠినమైన భద్రతా ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా రెవెన్యూ , ఎన్నికల అధికారులు మరియు పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఎలాంటి మొహమాటం లేకుండా అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఐజి ఎస్పీ హెచ్చరించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్ బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు డి.ఎస్.పి శిరిడి శ్రావణ్ కుమార్,ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు,పోలీసు అధికారులు మరియు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *