అభ్యర్థులకు బీ-ఫార్మ్స్ అందజేసిన డాక్టర్ సుధీర్
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: వైకాపా ఎంపిటీసీ అభ్యర్థులకు మరియు జడ్పిటిసి అభ్యర్థులకు బి ఫామ్స్ పత్రాలను నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దారా సుధీర్ అందజేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పార్టీ కార్యాలయంలో సోమవారం నందికొట్కూరు జడ్పిటిసి వైసీపీ అభ్యర్థి సురేష్ యాదవ్ మరియు నందికొట్కూరు మండలంలోని ఎంపిటిసి అభ్యర్థులు అందెల కళావతి,నీలావేణి, మాదిరెడ్డి వెంకటేశ్వరమ్మ, బోరెల్లి కరుణమ్మ,చంద్ర శేఖర్ రెడ్డి మ్,డి హరిబాబు, శ్రీనివాసులు,పుట్టా సునీత, ఫాతిమాభి,జి శ్రీనివాసులు11 మందికి పార్టీ బీ-ఫార్మ్స్ పత్రాలను అభ్యర్థులకు మరియు తదితర అభ్యర్థులకు అందజేశారు.పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ సుధీర్ అభ్యర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శాతనకోట మాజీ సర్పంచ్ జనార్దన్ గౌడ్ మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.


