NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్టోబర్ 31న మడుపల్లి మోహన గుప్త-మల్లేశ్వరి దంపతులకు ఘన ఆత్మీయ సన్మానం

1 min read

82వ జన్మదినం సందర్భంగా కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సాంస్కృతిక, సేవా,ఆధ్యాత్మిక, విద్యా రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న ఆదర్శమూర్తులు, గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మడుపల్లి మోహన గుప్త (ఎమ్.ఎమ్. గుప్తా) 82వ జన్మదినం సందర్భంగా వారికి మరియు వారి ధర్మపత్ని మల్లేశ్వరి దంపతులకు ఘన ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.31 అక్టోబర్ 2026, శనివారం ఉదయం 11:00 గంటలకు ఏలూరులోని వై.ఎం.హెచ్.ఏ. (ఎ.సి.) హాల్ లో వైభవంగా జరగనుందన్నరు.ఈ సందర్భంగా ఏలూరు వై.ఎం.హెచ్.ఏ.హాలు నందు సన్మాన నిర్వహణ కమిటీ మరియు భాగస్వామ్య సంస్థల ప్రతినిధుల సమక్షంలో ముందస్తు సమాలోచన సమావేశం నిర్వహించి, ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సమావేశంలో హిందూ యువజన సంఘం (వై.ఎం.హెచ్.ఏ) మేనేజ్మెంట్ మరియు కార్యనిర్వాహక కమిటీ ప్రతినిధులు,ఏలూరు పట్టణ పరిధిలోని 40కి పైగా కళా,సేవా,ఆధ్యాత్మిక, విద్యాసంస్థలు, వ్యాపార-వాణిజ్య సంఘాల ప్రతినిధులు,సభ్యులు మరియు మోహన గుప్త మిత్రబృందం పెద్ద సంఖ్యలో పాల్గొని సన్మాన మహోత్సవాన్ని విజయవంతం చేయడంపై చర్చించారు.  సామాజిక,సేవా కార్యక్రమాలలో నిరంతరం ముందుంటూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతున్న  మడుపల్లి మోహన గుప్త ని గౌరవించుకునే ఈ సన్మాన మహోత్సవంలో ఏలూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు,కళాభిమానులు,వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.వి.సత్యనారాయణ,అధ్యక్షులు యర్రా.సోమలింగేశ్వరరావు, కార్యనిర్వహక కమిటీ అధ్యక్షులు యిరదల ముద్దుకృష్ణ ,సంస్థ గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ లునాని మరియు నిర్వాహణ సమిష్టి సంస్థల ప్రతినిధులు కోరారు.ఈ సమావేశంలో మేనేజ్మెంట్ కమిటీ ఉపాధ్యక్షులు వేమా కోటేశ్వరరావు,సహాయ కార్యదర్శి డాక్టర్: గుడిపాటి లలితా శర్మ,కార్యనిర్వహక కమిటీ ఉపాధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరరావు (ఎల్ వి.ఆర్), సభ్యులు రేవూరి శివశంకర వరప్రసాద్,డాక్టర్ లంక వెంకటేశ్వర్లు,పెదపాటి రామకృష్ణ,కొత్త గుండు శ్రీనివాస్,కనిగోళ్ళ హేమంత్ కుమార్,కుమారీ ఏ పార్వతీ రామచంద్రన్,ఎంవి రవీంద్ర, ఎం సూర్యనారాయణ యాదవ్, దువ్వి హేమ సుందర్, కొమ్మన కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *