NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‎ద్వారకా తిరుమలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు

1 min read

‎

ఆలయ పండితులు ఎంపీకి శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనం, స్వామివారి శేషావస్త్రం,తీర్థ ప్రసాదాలు అందజేత

ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ద్వారకా తిరుమల ఆలయం సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం ద్వారకా తిరుమల వచ్చిన ఎంపీకి ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ పండితులు ఎంపీకి శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనం, స్వామివారి శేషావస్త్రం, తీర్థ ప్రసాదాలు అందించారు. రాష్ట్రంలోనూ, ఏలూరు పార్లమెంట్ పరిధిలోనూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేంకటేశ్వరస్వామిని ప్రార్ధించినట్లు ఎంపీ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *