NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా గోపూజ .. కుంకుమార్చన కార్యక్రమాలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  తిరుమల తిరుపతి దేవస్థానములు – హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల మండలం, గుంతనాల గ్రామంలోని శ్రీ రామాలయం నందు గోవత్స ద్వాదశి మరియు ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడినది. ఈ సందర్బంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ గోవును భారతీయ సంస్కృతిలో తల్లిగా, సమస్త దేవతలు కొలువైన పవిత్ర మూర్తిగా భావిస్తారని, గోవత్స ద్వాదశి నాడు గోవును పూజించడం వలన సంతాన భాగ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని, అలాగే ఆయుర్వేదానికి మూల పురుషుడు, ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి జయంతి నాడు స్వామివారిని పూజిస్తే రోగ బాధలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ధార్మిక ప్రవచకులు డాక్టర్  దోనేపూడి నరేశ్ బాబు  మాట్లాడుతూ గోవును కాపాడుకుంటేనే మన ధర్మం, మన సంస్కృతి నిలబడుతుందని, గోపూజ అంటే కేవలం ఒక కార్యక్రమం కాదు, అది ప్రకృతిని, జీవరాశిని గౌరవించే గొప్ప సంప్రదాయమని, ధన్వంతరి జయంతి మనకు ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తు చేస్తుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా గోవుకు పసుపు, కుంకుమ,  పూలమాలలు, వస్త్రాలతో అలంకరించి, మంగళ హారతులు సమర్పించారు. మహిళలచే అమ్మవారికి కుంకుమార్చన, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. స్థానిక అర్చకులు తాటిపాటి గిరిధర శర్మ భక్తులందరిచే సామూహిక కుంకుమార్చన, సామూహిక వత్ససహిత గోపూజ నిర్వహింపచేశారు. ఈ కార్యక్రమంలో భజన బృందం సభ్యులు గాలి జగదీశ్వర్ రెడ్డి, కె. సి గురువిరెడ్డి, బీరం వెంకట సుబ్బారెడ్డి, ఎస్. వీర నాగేశ్వరప్ప, దేశం వెంకటరెడ్డి, పి. శివరాముడు, గాలి రవీంద్రారెడ్డి, వి. సాయిబాబా, టి. శివలక్ష్ముమ్మ, గోవర్ధన్, కె. నాగమణెమ్మ, బి. ఓబులమ్మ, బి.శివమ్మ, ఎస్.వీరమ్మ, గాలి పుల్లమ్మ, టి. దేవమ్మ, వెంకట సుబ్బమ్మతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *