NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీనియర్ సిటిజన్స్ నూతన కార్యవర్గ సమావేశం

1 min read

శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కమిటీ

మదనపల్లె , ( బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి ) : ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ నూతన కార్యవర్గ సమావేశం మదనపల్లెలో స్థానిక జిఆర్టి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు జరిగింది. శనివారం జరిగిన ఈ సమా వేశానికి అసోసి యేషన్ నూతన  అధ్యక్షులు సి ఆర్ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. సెక్రెటరీ రాజన్న గత మాసపు ‌ మినిట్స్ చదివి విని పించారు. ‌ట్రెజరర్ కుమారస్వామి జమా ఖర్చుల నివేదిక  సమ ర్పించారు. అనంత రం అధ్యక్షుడు సి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా నన్ను ఎన్ను కున్నందుకు జిల్లా అధ్యక్షులు‌ డా. ఎన్ ముని గోపాల కృష్ణకు, జిల్లా సెక్రెటరీ వెంకటేశ్వర్లు కు, ట్రెజరర్ తిమ్మయ్య కు , ఎలక్షన్ ఆఫీసర్  సభ్యులందరి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ కి, ఎలక్షన్ అబ్జర్వర్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి కి,అసోసియేషన్ సభ్యులకు పేరు పేరునా ధన్య వాదాలు తెలిపారు. సెక్రటరీ రాజన్న మాట్లాడుతూ మన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ యాప్ లో సీనియర్ సిటిజన్స్ కు సంబంధించిన  విషయాలను పొందు పరచాలని సలహా ఇచ్చారు. జి ఆర్ టి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ మాట్లా డుతూ నూతన  కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముని గోపాల కృష్ణ ‌ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన  అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  జిల్లా జనరల్ సెక్రెటరీ మాట్లా డుతూ నూతనంగా ఎన్నికైన ఆఫీస్ ‌ బేరర్స్ ‌కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ట్రెజరర్ తిమ్మయ్య మాట్లాడుతూ నూతన  కార్యవర్గ సభ్యులు ఐక మత్యం తో కలిసి  అసోసియేషన్ సమస్యలను పరిష్కరించి సీనియర్ సిటిజన్స్ కు సేవలందిం చాలని తెలియ జేశారు. జాయింట్ సెక్రెటరీ ‌ వి ఎం నాగరాజా, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా కార్యవర్గ సభ్యుల తో తన వంతు అసోసియేషన్ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో శ్రీధర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్  ధనలక్ష్మి,  ప్రేమ, జైలు డిపార్ట్మెంట్ ప్రభాకర్  లు ‌ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *