NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాచవేటివారిపల్లి ఎంపీటీసీగా మాధవీలత విజయం

1 min read

శుభాకాంక్షలు తెలిపిన టిడిపి, కూటమి నాయకులు

మదనపల్లె , ( బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి ) : నిమ్మనపల్లి మండలం, రాచవేటి వారిపల్లి ఎంపీటీసీ గా కూటమి బల పరిచిన టిడిపి అభ్యర్థిని మాధవీ లత విజయం సాధించారు.ఈ సందర్భంగా శనివారం ఆమె భర్త,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్ మాట్లా డుతూ ప్రజల ఆశీర్వాదం,కూటమి నాయకుల సహ కారంతో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు.గతంలో పంచాయతీలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఆశీర్వ దించారన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేస్తున్నామన్నారు.ఇటీవల మునిసిపల్ ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపిటిసీ,జెడ్పిటిసి ఎన్నికలలో కూటమి కి అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు కృతజ్ఞ తలు తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో పంచాయతీని మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిల బెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *