మిడుతూరు జడ్పిటీసీ గా సంపంగి హైమావతి
1 min read
-877 ఓట్ల మెజారిటీతో గెలుపు..
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు జడ్పిటిసిగా సంపంగి హైమావతి గెలుపు సాధించారు.నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ జరిగింది.వైకాపా జడ్పిటిసి అభ్యర్థి దూదేకుల రజియాబిపై తెదేపా అభ్యర్థి సంపంగి హైమావతి877 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలుపొందినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు డిక్లరేషన్ పత్రాన్ని ఆమెకు అందజేశారు.గతంలో మిడుతూరు జడ్పిటిసిగా రెండుసార్లు వరుసగా వైసీపీ ఖాతాలో ఉంది.ఈసారి మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని అనుకున్న వైసీపీ ప్లాన్ కు టిడిపి బ్రేక్ వేసింది.మిడుతూరు మండలంలో జడ్పిటిసి గా తెదేపా ఖాతాలోకి వచ్చినందున టిడిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


