ప్రజాస్వామ్యాన్ని రక్షించండి…
1 min read
స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ హింసాత్మక చర్యలను నిరసించండి
సిపిఐ,సిపిఐ(ఎం)నాయకుల డిమాండ్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వం అవలంబించిన హింసాత్మక విధానాలను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపిఐ(ఎం) పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు,పాత బస్టాండ్,అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను భయపెట్టి,నామినేషన్ పత్రాలను చింపివేసి పోటీ చేయకుండా భయభ్రాంతులకు గురిచేసి కూటమి ప్రభుత్వం ప్రజలను ఓటు వేయనివ్వకుండా ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అవలంబించిన హింసాత్మక చర్యలకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం,ఎన్నికల కమిషన్ నిస్సిగ్గుగా సహకరించాయని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హరిస్తూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పాల్పడిన హింసాత్మక చర్యలకు ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పేలా పోరాటాలను రూపొందిస్తామని హెచ్చరించారు.డబ్బు,మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసి ప్రజలను ప్రలోభ పెట్టి,పోలీసు యంత్రాంగాన్ని ఎన్నికల సంఘాన్ని వినియోగించుకొని స్థానిక ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద డబ్బు,మద్యం పంపిణీ చేసినా చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూడడంతో దీన్ని ఆసరాగా చేసుకొని అధికార కూటమి ప్రభుత్వం రౌడీయిజం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపివేసినా చర్యలు తీసుకోలేని పరిస్థితులను కూటమి ప్రభుత్వం కల్పించిందని ఇటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రజలంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగే పోరాటాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరావు,ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్,సిపిఐ ఏలూరు జిల్లా కౌన్సిల్ సభ్యులు పుప్పాల కన్నబాబు, సిపిఐ (ఎం)నగర కార్యదర్శి పంపన రవికుమార్, సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కురేళ్ళ వరప్రసాద్, సిపిఎం నగర కమిటీ సభ్యులుకడలి రామాంజనేయులు, వి.వి.వి.ఎన్.ప్రసాద్,సిపిఐ ఏలూరు ఏరియా సమితి సభ్యులు బళ్ల కనక దుర్గారావు, ఎం.ఏ.హకీమ్,బుగ్గల ప్రభాకర్,తమ్మిశెట్టి రమణయ్య,సభ్యులు ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవాని, ఉప్పులూరి జ్యోతి, ఉప్పులూరి ప్రభావతి, ఏఐటీయూసీ నాయకులు పిల్ల నాగేశ్వరావు, పుప్పాల నాగేశ్వరావు, వల్లెపు యేసు,సీశాల శ్రీను, జె.పోతురాజు,జి నాయుడు, ఎస్.రాంబాబు, ఎం.రాంప్రసాద్, బుధరయ్య,రాయి నాయుడు,సిపిఐ(ఎం)నాయకులు మావూరి శ్రీనివాస్,కొడవలి శ్రీనివాస్,కట్టా సత్యనారాయణ,జక్కంశెట్టి హరీషా దుర్గ,గనిగంటి కోటేశ్వరరావు,లద్దాని సత్యనారాయణ,దుర్గారావు,జి.ఏసుబాబు,అల్లం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


