NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

1 min read

ఘన నివాళులు అర్పించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ వై ప్రసాద్ రావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత దేశంలో విద్యాభివృద్ధికి, జాతీయ సమైక్యతకు ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం అనిస్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ వై. ప్రసాద్ రావు, ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.సిబ్బందికి అదనపు ఎస్పీ అడ్మిన్ స్వీట్ పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వై. ప్రసాద్ రావు మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర సాధనకు, విద్యారంగ అభివృద్ధికి, జాతీయ సమైక్యతకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమని విశ్వసించిన ఆయన, అందరికీ విద్యావకాశాలు అందుబాటులో ఉండాలని కృషి చేశారని తెలిపారు. యువత తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, అన్ని వర్గాల ప్రజలతో సౌహార్ద సంబంధాలను కొనసాగించాలని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, ఐక్యతను కాపాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించడమే మహనీయుల ఆదర్శాలకు అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమములో ఏ ఆర్ అదనపు ఎస్పీ జి.ముని రాజా,ఎస్ బి ఇన్స్పెక్టర్  మల్లేశ్వర రావు,డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ హబీబ్ భాష ,పోలీస్ ప్రధాన కార్యాలయం ఏ ఓ శ్రీ షేక్ మస్తాన్,ఏ సెక్షన్ సూపర్డెంట్ సువర్చల బి సెక్షన్ సూపర్డెంట్ నాగేశ్వరరావు, ఏ ఆర్ ఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ ఎస్ ఐ వెంకటేష్ ప్రధాన కార్యాలయం సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *