NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విరపురం మఠం నూతన దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

1 min read

శివమొగ్గ జిల్లాలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆలూరు న్యూస్ నేడు: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా, సాగర్ తాలూకాలో ఉన్న విరపురం మఠం నూతన దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి , వారి సతీమణి శ్రీమతి బుసినే రామాంజినమ్మ  ముఖ్యంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆలయంలో నిర్వహించిన హోమం, పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి తనయుడు, శివమొగ్గ ఎంపీ బి.వై. రాఘవేంద్ర, కర్ణాటక రాష్ట్ర మంత్రులు లక్ష్మన్న , రుద్రప్ప లంబాడి , ఎమ్మెల్యే హెచ్.కె. పాటిల్ , వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.విరపురం మఠం నూతన దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *