ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ : పత్తికొండ స్థానిక శాంతి టాలెంట్ హై స్కూల్లో కరస్పాండెంట్ కొత్తపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రివర్యులు ,మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, నేడు జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఆ మహానీయునీ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన తెలిపారు. అబుల్ కలాం ఈ దేశంలో ఐఐటి, యు జిసి మరియు ప్రాథమిక నిర్బంధ విద్య ద్వారా విద్యాభివృద్ధికి బాటలు వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పారు .విద్యనే సామాజిక మార్పుకు ఆయుధమని, సమానత్వానికి పునాది అని ,సామాజ ప్రగతికి వెలుగు దారి అని చెప్పిన మహానుభావుడు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, రహంతుల్లా , హామీద్ భాష,మక్తుం వలి,మహబూబ్ బి,విజయభారతి, స్వాతి ,లావణ్య , జోష్ణప్రియ,వైష్ణవి ,గాయత్రి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


