NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో లక్ష గులాభి పూలతో లక్ష పుష్పార్చన

1 min read

సుమారు 250 మంది భక్తులు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దీక్షలు

ఆలయ అసిస్టెంట్ కమీషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కార్తీక మాసం మొదటి బుధవారం కావున ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం మండలం,గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానం నందు లక్ష గులాభి పూలతో లక్ష పుష్పార్చన ఆలయ అర్చకులు,వేద పండితులు,ఋత్వికులు ఆద్యర్యములో అత్యంత వైభవముగా జరిగింది. ఉదయం సుమారు 250 మంది భక్తులు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దీక్షలు తీసుకొనినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.రేపు అనగా ది.12.11.2026 ఉదయం గం.08.30 ని.లకు జంగారెడ్డిగూడెం రెవిన్యూ డివిజినల్ అధికారిని, ఏం.వి.రమణ చే కార్తీక మాస 33వ సప్తాహముల ప్రారంభ కార్యక్రమం జరుగునని  ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *