ఎంపీటీసీ దాసరి గోవిందరావును ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే
1 min read
ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలి.. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి
కమ్మరచేడు, ముసనహళ్లి, కత్రికి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి – ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
హొళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కమ్మరచేడు ఎంపీటీసీగా నూతనంగా ఎన్నికైన దాసరి గోవిందరావు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నూతన ఎంపీటీసీ దాసరి గోవిందరావును అభినందించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ, ఎంపీటీసీగా ప్రజా సేవకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు, ఫిర్యాదులను చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. పదవి అనేది ప్రజలకు సేవ చేసే బాధ్యత అని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు.కమ్మరచేడు, ముసనహళ్లి, కత్రికి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని దాసరి గోవిందరావుకు సూచించారు.అలాగే స్థానిక ఎన్నికల సమయంలో అధికార కూటమి కుట్రలు, ప్రలోభాలు, బెదిరింపులను ఎదుర్కొని ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైన సేవల ద్వారా గౌరవించాలని అన్నారు.అనంతరం నూతన ఎంపీటీసీ దాసరి గోవిందరావు మాట్లాడుతూ, తనను ఎంపీటీసీగా ఎంపిక చేసి గెలిపించడంలో సహకరించిన ఎమ్మెల్యే బుసినే విరుపాక్షికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తనకు అండగా నిలిచిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారుఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బుసినే విరుపాక్షి అభిమానులు పాల్గొన్నారు.



