NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలన

1 min read

రెండేళ్లలో ఏలూరు నియోజకవర్గం లో అభివృద్ధి పరుగులు

53వ డివిజన్‌లో రహదారి పనులు,టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం ఎటువంటి లోపాలు లేకుండా  పాద దర్శకంగా జరగాలి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి అన్నారు. నగరంలోని 53వ డివిజన్‌లో నూతనంగా నిర్మిస్తున్న రహదారి పనులను, అనంతరం నిర్మాణంలో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయ పనులను ఆయన పరిశీలించారు. రహదారుల అభివృద్ధి, వసతుల కల్పనతోపాటు సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా పాద దర్శకంగా జరగాలని అధికారులకు ఎమ్మెల్యే బడేటి ఆదేశించారు. ఆయన వెంట మునిసిపల్ అధికారులు, సంబంధిత సిబ్బంది, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *