ఏలూరు నగర నూతన మేయర్ కి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు
1 min read
ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం బలపరిచిన ఏలూరు నగర మేయర్ రెడ్డి అప్పలనాయుడుని ఏలూరుజిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూల బొకే అందించి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తన విజయం లో ఉద్యోగుల సహకారం ఎంతో ఉందని, ప్రభుత్వ పథకాలు అమలు చేయుటలో ఉద్యోగులు పాత్ర కీలకమని, ఉద్యోగులు కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నరు.ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల ప్రేమ కలిగి ఉంటుందని కోరారు. దానికి ఉద్యోగులు సహకరించి మంచి పేరు తీసుకువస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ(ఏ పి జి ఇ ఏ) నాయకులు జిల్లా మాజీ అధ్యక్షులు ఎన్ ఎస్ వి రామకృష్ణారావు,జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ జె.గోవిందరావు, స్టేట్ ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ విజయ శ్యామల,వైస్ ప్రెసిడెంట్ సుందర్, స్వరాజ్యమని, రత్నకుమారి, ఏలూరు తాలూకా ప్రెసిడెంట్ నీలిమాదేవి, సంయుక్త కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా ఇ సి మెంబర్స్ సుభాషిని, మేకా శ్రీనివాసరావు,విజయ మేరీ, శ్రీలక్ష్మి, ఝాన్సీ, ప్రసాద్ బాబు, తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.


