NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగంపై విద్యార్థుల్లో అవగాహన

1 min read

ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు : డి ఆర్ ఓ రాము నాయక్

నంద్యాల, న్యూస్​ నేడు :  ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగంపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ELC) ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి  రాము నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలు నందు  ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీల కార్యక్రమం ను డి ఆర్ ఓ రాము నాయక్ జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి, మనోహర్, సూపర్డెంట్ ఎలక్షన్ సెల్  తో కలసి నిర్వహించిన ఈ పోటీలను  ఒక్కో విద్యా సంస్థ నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.డి ఆర్ ఓ మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగంపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ELC) ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. వ్యాసరచన పోటీల్లో ఓటరు జాబితా ప్రాముఖ్యత (Importance of Electoral Roll), ఓటు హక్కు ప్రాముఖ్యత (Importance of Voting) అనే అంశాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ క్విజ్ పోటీల్లో భాగంగా విద్యార్థులకు 50 ప్రశ్నలతో పరీక్ష నిర్వహించామన్నారు.  జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.  విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని  తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *