NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన

1 min read

ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్ పోటీలు

పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు, న్యూస్​ నేడు: 18 విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం జరుగుతోందని పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్ లో  ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల (ELCs) ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ స్థాయిలో పాఠశాల,  విద్యార్థులకు వ్యాసరచన  విద్యార్థులు, క్విజ్  విద్యార్థులు పోటీలల్లో గెలుపొందిన 20 మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్ ను పాణ్యం ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అందజేసి విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రాధాన్యత, ఓటు హక్కు వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఓటరు జాబితా తయారీ, ఈవీఎం, వీవీప్యాట్, పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు తదితర ఎన్నికల సంబంధిత అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, ఎన్నికలపై అవగాహనను వెలికితీసేలా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో వ్యాసరచనకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. పోటీలను విద్యాసంస్థల స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో మూడు దశల్లో నిర్వహించినట్లు వివరించారు. విద్యాసంస్థల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై సరైన అవగాహన కలిగి ఉండటం, ఓటు హక్కు విలువను గుర్తించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అలవర్చుకొని భవిష్యత్తులో బాధ్యతాయుతమైన ఓటర్లుగా ఎదగాలని సూచించారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలను విద్యాసంస్థల్లో విస్తృతంగా నిర్వహించడం ద్వారా ఎన్నికల పట్ల విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించవచ్చని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కల్లూరు తహశీల్దార్ కే. ఆంజనేయులు, వనజ కుమారి, సంబధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *