సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వాలనే తపన విద్యార్థుల్లో పెరగాలి
1 min read
బిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఫ్రెషర్స్ డే వేడుకలు
ప్రిన్సిపాల్ డాక్టర్ గుత్తా గిరిబాబు
మదనపల్లె , బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి : విద్యార్థులు విద్య తో పాటు సామాజిక బాధ్యతను కూడా అలవరచుకోవాలని, తమకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఎంతో కొంత అందించాలనే తపనను పెంపొందించుకోవాలని బెసెంట్ థియోసాఫికల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుత్తా గిరిబాబు పిలుపు నిచ్చారు. బుధ వారం కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన మాట్లా డుతూ విద్యార్థులు సమాజంతో మమే కమై, సామాజిక అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వాయల్పాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా అమ రేశ్వరి విద్యార్థుల ను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేకమైన ప్రతిభ, సామర్థ్యాలు దాగి ఉంటాయని, వాటిని గుర్తించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగా లని సూచించారు. విద్యార్థుల్లోని అంతర్గత బలాల ను, సానుకూల ఆలోచనా విధా నాన్ని ప్రస్తావిస్తూ వారిలో ఆత్మవిశ్వా సాన్ని, ఉన్నత లక్ష్యాలను సాధించాలనే ఆకాంక్షను నింపారు. ఆమె ప్రసంగం విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని కలిగించారు.కళాశాల పూర్వ భౌతికశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ తాను విద్యనభ్య సించి, సేవలందిం చిన ఈ కళాశాల అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలి పారు. నిమ్మనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ కోవూరు శ్రీధర్, మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ నక్కా మోహన్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తి దాయకమైన ఉపన్యసమిచ్చారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టు కున్నాయి. ఈ కార్యక్రమం లో స్టేజ్ కన్వీనర్‌గా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గన్నవరం శ్రీదేవి,అధ్యాపకులు డా. శైలజ, డా. డేరంగుల శ్రీని వాసులు, డా. జి. చిన్నారెడ్డి, టి. బాలాజీ, పి. ప్రదీప్, డాక్టర్ ఎస్. గురు ప్రసాద్, డా. పి. రవీంద్రనాథ్ రెడ్డి, డా. పి. కృష్ణవేణి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


