NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర స్కేటింగ్ లో జిల్లా  కు పతకాలు

1 min read

కర్నూల్ స్పోర్ట్స్, న్యూస్​ నేడు:     స్కేటింగ్ లో జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అభిప్రాయపడ్డారు, ఇటీవల  38వ రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు  నవంబర్ 9  నుండి  15 వరకు కాకినాడలో ని వైయస్సార్ స్కేటింగ్ రింకులో స్కేటింగ్ పోటీలు నిర్వహించారు, ఈ పోటీలలో కర్నూలు జిల్లాకు చెందిన ఎస్ యం డీ  ఇర్ఫాన్ పురుషుల విభాగంలో రింకు రేస్ లో కాంశ్య పతకం రోడ్ రేస్ లలో వెండి పతకం కైవసం చేసుకున్నాడు, అలాగే 15 సంవత్సరాల బాలికల విభాగ పోటీల్లో భవిష్య తేజ రోడ్ రోడ్ రేస్ లో వెండి మెడల్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా అదనపు కార్యదర్శి అన్నం పునీత చౌదరి, సీఈవో పీ సునీల్ కుమార్ తెలిపారు, ఈ సందర్భంగా  కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ నూ కలిశారు, ఈ సందర్బంగా  జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డా సిరి    క్రీడాకారులకు మెడల్స్ వేసి సత్కరించారు జాతీయస్థాయిలో జిల్లాకు మరిన్ని పథకాలు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి భూపతిరావు, జిల్లా స్కేటింగ్ సంఘం సంయుక్త కార్యదర్శి  స్రవంతి, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కలెక్టర్​, కలెక్టర్​, పోటీలు,

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *