అక్కడ రూపాయికే బిర్యానీ !
1 min readపల్లెవెలుగు వెబ్ : వ్యాపారంలో విజయం సాధించడానికి.. పోటీలో నిలదొక్కుకోవడానికి వ్యాపారులు ఎన్నో వ్యూహాలు అనుసరిస్తారు. కొత్తగా ప్రారంభించే వ్యాపారానికి కూడ ఎలాంటి అడ్వర్టైజ్ మెంట్ ఖర్చు లేకుండా కొందరు వ్యూహాత్మక ప్రకటనలు ఇస్తారు. అలాంటి కోవకు చెందినదే ఈ ప్రకటన. తమిళనాడులోని దిండిగల్ జిల్లా సిరుమైలైలో ఓ వ్యాపారి కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి వినూత్న ప్రకటన చేశారు. రూపాయికే బిర్యాని అంటూ ఆఫర్ ఇచ్చారు. దీంతో స్థానికులు ఎగబడ్డారు. అయితే.. ఆ వ్యాపారి ఇక్కడ ఓ నిబంధన పెట్టారు. పాత రూపాయి నోటు తీసుకొచ్చిన మొదటి వంద మందికి మాత్రమే రూపాయి బిర్యానీ అంటూ షరతు పెట్టారు. దీంతో పాత రూపాయి నోట్లు ఉన్న వారంతా రెస్టారెంట్ ముందు క్యూ కట్టారు.