స్వల్ప లాభాల్లో సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో కదులుతున్నాయి. సోమవారం భారీ లాభాలతో ముగిసిన సూచీలు మంగళవారం అప్రమత్తంగా కదులుతున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్, యూరోపియన్, ఆసియా మార్కెట్లు పాజిటివ్ గా కదులుతున్న నేపథ్యంలో దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో కదులుతున్నాయి. పవర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా స్టాక్స్ లాభాల్లో నడుస్తున్నాయి. సెన్సెక్స్ 168 పాయింట్ల లాభంతో 57,057 స్థాయి వద్ద కదులుతోంది. నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 16,985 వద్ద కదులుతోంది. బ్యాంక్ నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 36,486 వద్ద కదులుతోంది.