కర్నూలులో ఘోరం.. నిద్రిస్తున్న భార్యను హత్య చేసిన కానిస్టేబుల్
1 min readపల్లెవెలుగు వెబ్ : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భార్యను ఓ కానిస్టేబుల్ అమానుషంగా హత్య చేశారు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో చంద్రశేఖర్ అనే ఏఆర్ కానిస్టేబుల్ తన భార్య ధరణి (29)ని తలదిండు మొహంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ధరణి తల్లి అనంతమ్మ ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్, అతడి తల్లి దేవాదానమ్మ, అన్న కృపానందం, వదిన బేబీపై వరకట్నపు హత్య కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.