బిగ్ బాస్ -5 తొలి ఎలిమినేషన్ ఎవరంటే ?
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ -5 తొలి ఎలిమినేషన్ జరిగింది. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా సరయు ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ -5 సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి వెళ్లారు. తొలి వారంలో హౌస్ నుంచి బయటికి వెళ్లడానికి ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ఆర్జే కాజల్, రవి, మానస్, జశ్వంత్ , సరయు, హమీదా ఉన్నారు. సరయుకి తక్కువ ఓట్లు వచ్చాయని నాగార్జున తెలిపారు. తొలి వారంలో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఆమెను ముగ్గురు నామినేట్ చేశారు.