PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చట్టాల పై అవగాహన పెంచుకోవాలి

1 min read

– పత్తికొండ జూనియర్​ కోర్టు సివిల్​ జడ్జి దివ్యశ్రీ
పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పత్తికొండ జూనియర్ కోర్ట్ సివిల్ జడ్జి దివ్యశ్రీ సూచించారు . మండలంలోని పుచ్చకాయల మాడ గ్రామంలో శుక్రవారం ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సు లో ఆమె ప్రసంగించారు. కక్షిదారులు న్యాయం కోసం వ్యయ ప్రయాసలకోర్చి న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. పేదలకు అల్పాదాయ వర్గాల వారికి న్యాయం చేకూర్చేందుకు మొబైల్ కోర్టులు ఏర్పడ్డాయని తెలిపారు .త్వరితగతిన కేసుల పరిష్కారానికి న్యాయస్థానాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఇరువర్గాలు రాజీ మార్గంలో కేసులను త్వరితగతిన పరిష్కారం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు చట్టాల పై అవగాహన కలిగి ఉండి న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యాయ విజ్ఞాన సదస్సు లో గ్రామ పెద్దలు కె సాంబశివ రెడ్డి సీనియర్ న్యాయవాదులు ఈరన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ న్యాయవాదులు శ్రీనివాసరెడ్డి కాశీనాథ్ బాబు న్యాయ సలహాలు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author