టీడీపీ మహిళా నేత ఇంటిపై దాడి.. 6 బైకులు దగ్ధం !
1 min readపల్లెవెలుగు వెబ్ : వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. వినాయక నిమజ్జనం సందర్భంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో అర్ధరాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ మాజీ జడ్పీటీసీ బత్తిని శారద ఇంటికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఆమె ఇంటిపై రాళ్లదాడికి దిగారు. ఇంట్లోకి దూరి సామాగ్రి ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న 6 బైక్ లకు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. పోలీసులు ఎదుటనే ఘటన జరిగినట్టు బాధితులు చెబుతున్నారు. కొద్దిసేపటి క్రితం డీఎస్పీ, సీఐ, ఎస్ఐ భారీ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.