పవన్కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అవంతి మండిపాటు!
1 min read

పల్లెవెలుగువెబ్, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్కళ్యాన్ రిపబ్లిక్ చిత్రపంక్షన్లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీ పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. రాజ్యంగబద్ధంగా ఎన్నకోబడ్డ ప్రభుత్వం, మంత్రులపై ఎలా మాట్లాడాలన్నది ముందు తెలుసుకొని మాట్లాడాలన్నారు. విశాఖ జిల్లాలో గులాబ్ తుఫాన్ ప్రాంతాల్లో పర్యటిస్తోన్న మంత్రి అవంతి పవన్కళ్యాణ్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. బూతులు మాట్లాడడం, నోటికొచ్చినట్లు విమర్శించడం సరైంది కాదన్నారు. ఆయన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

