చైతూ, సమంతల దాంపత్యానికి బ్రేక్!
1 min readపల్లెవెలుగువెబ్, హైదరాబాద్: ప్రముఖ తెలుగుచలన చిత్ర హీరో హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య, సమంతలు భార్యభర్తలుగా విడిపోయారు. ఇది అభిమానులకు షాకింగ్ న్యూసే.. అయినా జరిగిన ఘటనను స్వాగతించక తప్పదు. తాము విడిపోతున్న అంశాలన్నిసమంత సోషల్మీడియా ద్వారా తెలుగు ప్రేక్షక, అభిమానాలకు స్పష్టం చేశారు. దీంతో కొంతకాలంగా వీరి మధ్య వివాదాస్పందగా మారిన విడాకుల సమస్యకు తెరపడినట్లయంది. నాగచైతన్య, సమంతలు నాలుగేళ్ల క్రితం హిందూ, క్రిష్టియన్ సంప్రదాయాల్లో వివాహం చేసుకుని ఒకటైన విషయం తెలిసిందే. అయితే ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఇరువురి అభిష్ఠం మేరకే అధికారికంగా విడిపోతున్నట్లు సమంత పేర్కొనడం గమనార్హం. మా మనోభావాలను అభిమానులు అర్థం చేసుకుని… మా వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటిలాగే గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.