టీటీడీ నూతన పాలక మండలి తొలిసమావేశం! సీఎం జగన్ పర్యటనపై సమీక్ష
1 min readపల్లెవెలుగువెబ్, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి కొలువుదీరింది. ఈమేరకు గురువారం టీటీడీ బోర్డు తొలి సమావేశం జరిగింది. తితిదే ఈవో జవహర్‌రెడ్డి, చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో 18మంది సభ్యులు ప్రత్యక్షంగా, మిలిగిన వారు వర్చువల్‌గా పాల్గొన్నారు. సమావేశంలో ఈనెల 11న సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు, పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, వార్షిక బ్రహ్మత్సవాల రోజువారీ కార్యక్రమాల నిర్వేహణ, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం, టీటీడీ సిబ్బందికి సంబంధించిన నివేశన స్థలాలు తదితర అంశాలపై సమీక్షించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా తితిదే నూతన పాలకమండలిలో సభ్యుల నియామకం వివాదస్పదమైన విషయం తెలిసిందే. బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేసిన దృష్ట్యా విచారణ అనంతరం హైకోర్టు 18మంది సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో గురువారం టీటీడీ నూతన పాలకవర్గం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.