PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మా’లో ఊహించని పరిణామం..ప్రకాశ్​రాజ్​ టీం రాజీనామా!

1 min read

పల్లెవెలుగువెబ్​, హైదరాబాద్​: ‘మా‘(మూవీ అర్టిస్ట్స్​ అసోసియేషన్​)లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ టీం మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రకాశ్​రాజ్​ మీడియా ముందు పలు అంశాలను వెల్లడించారు. ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ నుంచి గెలుపొందిన 11మందిలో ఉపాధ్యక్షుడు బెనర్జీ, ఎగ్జిక్యూటివ్​ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్​, సంయుక్త కార్యదర్శిగా ఉత్తేజ్​, ఈసీ సభ్యులుగా శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్​, తనీష్​, సురేష్​ కొండేటి, సమీర్​, సుడిగాలి సుధీర్​, కౌశిక్​లు ఉన్నారు. అయితే వీరందరూ మూవీ అసోసియేషన్​ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త అసోసియేషన్​లో ఒకే ప్యానల్​ సభ్యులు ఉంటే బాగుంటుందని, మా అధ్యక్షుడు మంచు విష్ణుకు మా ప్యానల్​ తరపున సపోర్టు ఉంటుందని, తాము మరో అసోసియేషన్​ పెట్టడం లేదని ప్రకాశ్​రాజ్​ స్పష్టం చేశారు. అయితే ప్రకాశ్​రాజతోపాటు ఆ ప్యానల్​ సభ్యలు ‘మా’ ఎన్నికలు జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను మీడియా ముందు వ్యక్తం చేశారు. మున్ముందు జరిగే పరిణామాలపై ప్రశ్నించాంటే.. ‘మా‘ అసోసియేషన్​లో ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రకాశ్​రాజ్​ పేర్కొన్నారు.

About Author